ఇప్పుడు కొత్తగా(1 వ తేదీ నుంచి) SBI బ్రాంచీలలో గ్రీన్ చానల్ కౌంటర్లు ప్ర్రారంభించారు. దీనిలో పేపర్ వేస్ట్ తక్కువగా ఉంటుంది. మనం మన అకౌంట్ లో డబ్బు వెయ్యాలన్నా, తీయాలన్నా గానీ వోచర్స్ రాయనవసరం లేదు.
మన ATM card ను అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మిషనులో వుంచి ఈజీగా లావాదేవీలు చేసేయవచ్చు.
మన ATM card ను అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మిషనులో వుంచి ఈజీగా లావాదేవీలు చేసేయవచ్చు.
1. మెదటగా మన ఎ.టి.యం కార్డును మిషనులో ఒకసారి డ్రాగ్ చెయ్యాలి.
2. తర్వాత Deposit చేస్తున్నామా లేక Withdraw చేస్తున్నామా ఎంచుకోవాలి.
3. వెంటనే ఎంత డబ్బు లావాదేవీ చేస్తున్నామా అని నొక్కాలి.
4. ఇప్పుడు మన ఎ.టి.యం పిన్ నెంబరును ఎంటర్ చేస్తే ప్రాససింగ్ అని చూపిస్తుంది.
5. ఇప్పుడు ఆ మెత్తాన్ని కౌంటర్ లోని ఉద్యోగికి ఇస్తే, ఆయన మిగతా తతంగం నిర్వహిస్తారు.
6. చివరగా మనకు ఆ మిషను నుండి చిన్న కాగితం (బిల్లు) వస్తుంది.
7. ఇందులో 40,000 వరకూ ఒకరోజు లావాదేవీ చెయ్యవచ్చు. మన అకౌంట్ ఉన్న బ్రాంచి నుండి కాకుండా వేరే బ్రాంచి నుండీ డబ్బువేస్తే 20,000 వరకూ ఉచితం. 20,000 నుండి 40,000 వరకూ ప్రతి పదివేలకు రూ.1.50 చార్జీ చేస్తారు.
దీని వల్ల పెద్దపెద్ద వోచరు కాగితాలు రాయవలసిన పనిలేదు. కాబట్టి పేపరు ఖర్చు తగ్గుతుందని బ్యాంకు వారు చెప్తున్నారు.
ఈ పోస్టు ఎప్పటి నుంచో రాద్దాం అనుకున్నా గానీ ఇప్పటికి కుదిరింది...
No comments:
Post a Comment