మీకు ఒకటి కన్నా ఎక్కువ మెయిల్ ఐడీలు ఉన్నా లేదా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీ ని..... మీ gmail అకౌంట్ నుండే మేనేజ్ చేసేయచ్చు..... అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం.
సులభంగా అర్దం అవ్వడం కోసం..నేను ఏ మెయిల్ నుంచి అయితే వేరే మెయిల్‍ను కంట్రోల్ చెయ్యాలి అనుకుంటున్నానో (మన మెయిల్) దాన్ని మెదటి మెయిల్ అని అంటాను. ఇమేజస్‍లో 1 అని చూపించాను.
ఏ మెయిల్‍ను అయితే మన మెయిల్ నుంచి కంట్రోల్ చెయ్యాలో దాన్ని రెండవ మెయిల్ అంటాను. ఇమేజస్‍లో 2 అని చూపించాను.
1. మెదట “రెండవ మెయిల్‍ను” ఓపెన్ చేసి అందులోని సెట్టింగ్ పేజీ లోని Accounts&Import సెక్షన్ లోకి వెల్లండి.
2. అందులో add a another account పై క్లిక్ చెయ్యండి.
3. ఇప్పుడు వచ్చిన పాప్అప్ విండోలో మెదటి మెయిల్ ఐడీని టైప్ చేసి Next అని నొక్కండి.
5. ఇప్పుడు మెదటి మెయిల్ ఐడీకి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ పంపబడుతుంది.. దాన్ని క్లిక్ చెయ్యండి.
6. ఇప్పుడు మీ మెయిల్ కు ఆ రెండవ మెయిల్ ను జతచెయ్యడానికి 30 నిమిషాల సమయం పడుతుంది.
7. తరువాత మీరు లాగ్ఆన్ అయినపుడు ఇలా Switch user అనే కొత్త ఆప్షన్ వస్తుంది.
దాని ద్వారా వేరొక టాబ్ లో రెండవ మెయిల్ ఇలా ఓపెన్ అవుతుంది.
8. కాబట్టి మీరు రెండు మెయిల్స్ ను ఒకేసారి access చెయ్యవచ్చు.
9. రెండు మెయిల్‍లోని సందేశాలను చూడవచ్చు...వాటికి జవాబు కూడా ఇవ్వవచ్చు...కానీ రెండవ మెయిల్ ఐడీ నుండి పంపబడిన మెయిల్ స్వీకరించినవారికి show details లో send by లో మీ మెదటి మెయిల్ ఐడీ ఇలా కనపడుతుంది.
ఇంకా బాగా అర్దం అవ్వడానికి ఈ వీడియో చూడండి.....
No comments:
Post a Comment