రామాయణం లోని సుందరకాండలో...... హనుమంతుడు లంకలో ఉన్న సీతమ్మ తల్లి జాడను కనిపెట్టి, ఆమెకు రాముని ముద్రికను ఇచ్చి, ఆ తల్లి వద్దనుండి చూడామణిని తీసుకొని వచ్చి రామునికి ఆనందం కలిగిస్తాడు... అప్పుడు హనుమ రామునితో తాను ఆ తల్లిని ఎలా కనిపెట్టాను తదితర వివరాలను వివరించే ఆ సన్నివేశాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు ఎంతో చక్కగా ఈ పాటలో వర్ణించారు.... దీనిని మీరు ఈ వీడియోలో పాటను వింటూ చదువుకోవచ్చు...
ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె,
అదనెరిగి తెచ్చితి నవధరించవయ్యా ||
రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను బాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడునే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని ||
కమలాప్త కులుడ నీకమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీసేమమటు విన్నవించితిని ||
దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా-
దశనున్న చెలి గావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ||
ఇదె శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె,
అదనెరిగి తెచ్చితి నవధరించవయ్యా ||
రామ నిను బాసి నీరామ నే చూడగ నా
రామమున నిను బాడె రామరామ యనుచు
ఆ మెలుత సీతయని యపుడునే తెలిసి
నీ ముద్ర వుంగరము నే నిచ్చితిని ||
కమలాప్త కులుడ నీకమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీసేమమటు విన్నవించితిని ||
దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా-
దశనున్న చెలి గావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ||
No comments:
Post a Comment