మనం ఏదైనా ఊరికి వెళ్ళినపుడు లేదా ఆఫ్‍లైన్‍లో ఉన్నప్పుడు మనకు మెయిల్ చేసిన ఫ్రెండ్స్ కు ఆటోమాటిక్‍గా ఏదైనా ఒక సందేశం Reply గా వెళ్ళేలా జీమెయిల్‍లో ఏర్పాటు చేసుకోవచ్చు.
1. మెదట మెయిల్ సెట్టింగులను ఓపెన్ చెయ్యండి.
2. అందులో చివరగా ఉండే Vacation Responder అనే option వద్దకు వెల్లండి.
3. ఇక్కడ Subject అనే బాక్సులో Reply ఏ సబ్జెక్టుతో వెళ్ళాలో రాయండి
4. క్రింద ఉన్న బాక్సులో మీ సందేశాన్ని టైపు చెయ్యండి.
5. మీ కాంటాక్టు లిస్టులో ఉండే వారికి మాత్రమే ఈ సందేశం వెళ్ళేట్టుగా చెక్ బాక్సును చెక్ చెయ్యండి.
6. చివరగా save changes పై క్లిక్ చేస్తే ఇకపై మీకు మెయిల్ చేసిన వారికి ఈ ఆటోమాటిక్ రిప్లై చేరుతుంది.
7. దీనిని ఆఫ్ చెయ్యడానికి vacation Responder off ను చెక్ చేసి సేవ్ చేంజస్ పై క్లిక్ చేస్తేచాలు....
దీనిలో start date మీరు టైప్ చేసిన రోజు నుండి మెదలౌతుంది. కావాలంటే పక్కనే end date ను కూడా ఎంటర్ చెయ్యవచ్చు. అయితే ఈ సందేశం ఒకరే అనేక మార్లు మెయిల్ చేస్తే వెల్లదు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ మెయిల్స్ చేసినా వారికి మూడు రోజులకు ఒక్కసారి మాత్రమే సందేశం పంపబడుతుంది.........
See this Link for details: http://computerera.co.in/blog/?p=2617
No comments:
Post a Comment