February 8, 2012

Virtual OS లో ఇలా పార్టీషియన్స్ చేసుకోండి. (VMWARE Player)

VM Ware Player లో OS ఇన్‍స్టాల్ చేస్తున్నప్పుడు సామాన్యంగా కొంత డిస్క్ space ను ఎంచుకొని అందులో OS ను install చేసేస్తాం.. అప్పుడు మనకు C Drive మాత్రమే వస్తుంది.. కానీ మీరు దానిలో కూడా ఇంకొన్ని Local Drives ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారనుకోండి.. ఇలా ప్రయత్నించండి..


1. ముందుగా ఆ OS ను shutdown చెయ్యండి.. తర్వాత Edit virtual machine 
settings పై క్లిక్ చేసి, అందులో hard disk అనే సెక్షన్ ఎంచుకోండి..
కుడి పక్కన ఉన్న utilities మెనూ నుండి expand అనే ఆప్షన్ ఎంచుకోండి.


2.దానిలో డిస్క్ స్పేస్ ‍ను ఎంచుకోవాలి.. మీరు ఎంత expand చెయ్యాలో దానికి ఇప్పుడు ఉన్న capacity ని add చేసి ఎంటర్ చేసి, తర్వాత expand అనినొక్కండి.

 
3. ఇప్పుడు ఆ OS లోకి బూట్ అయ్యి My Computer పై రైట్ క్లిక్ చేసి Manage అనే ఆప్షన్ ఎంచుకోండి.
అప్పుడు వచ్చే విండో లో Disk management అనే  సెక్షన్ ఎంచుకోండి
అక్కడ మీరు ఎంచుకున్న extra space, Unallocated  space అని చూపిస్తుంది.. దానిపై రైట్ క్లిక్ చేసి create new partition ద్వారా ఎన్ని drives కావాలో అన్నిగా విభజించుకోండి..




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...