బ్లాగరు వాడేవారు ఎవరైనా పొరపాటున వారి పోస్టు ఏదైనా డిలీట్ అయినట్లు అయితే దాన్ని తిరిగి పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఈ టిప్ లో మనకు ఆ పోస్ట్ గూగుల్ లేదా ఏదేనీ సెర్చ్ ఇంజన్ లో చూపించబడుతుండాలి.
1. మెదటగా సెర్చ్ ఇంజన్ లో ఆ పోస్టుకు సంబందించిన కీ words వాడి ఆ రిజల్ట్ ని తెప్పించండి. ఆ రిజల్ట్ పై క్లిక్ చేస్తే ప్రస్తుతం పేజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది కానీ రిజల్ట్ కింద ఉన్న Cached అనే దానిపై క్లిక్ చేస్తే మాత్రం మన పోస్టు కనిపిస్తుంది (సెర్చ్ ఇంజన్లు మన రిజల్ట్ ను add చేసుకొనే ముందు దాని snap ఒకటి వాటి సర్వర్ లో ఉంచుతాయి, ప్రస్తుతం మనం దాన్ని చూస్తున్నాం)
2. ఇప్పుడు పేజ్ పై రైట్ క్లిక్ చేసి View source అనే option పై క్లిక్ చేస్తే ఆ పేజీ యెక్క HTML code ను చూపిస్తుంది. దానిలో “Post ID = " పక్కన ఒక నెంబరు ఉంటుంది దానిని కాపీ చేసుకోండి.
3. ఇప్పుడు మీ బ్లాగరులోకి లాగాన్ అయ్యి ప్రస్తుతం ఉన్న ఏదేనీ పోస్టును edit అని ప్రెస్ చేసి, అడ్రస్ బార్ లోని Post ID= తర్వాత ఉన్న నెంబరును మీరు కాపీ చేసుకోని ఉన్న నెంబరుతో రిప్లేస్ చేసి Enter press చేస్తే డిలీట్ అయిన మీ పాత పోస్టు కనపడుతుంది.
4. ఇంకేముంది publish post అని ప్రెస్ చేస్తే మీ డిలీట్ అయిన పోస్టు తిరిగి వచ్చేస్తుంది (అదే పాత లింకుతో సహా)
కష్టమైన పనిని సులభం చేసారే! మాజిక్ లా ఉంది కాని జిమ్మిక్ కాదు. మరిన్ని మాజిక్ ల కొసం ఎదురు చూస్తూ...
ReplyDeleteచాలా మంచి చిట్కా చెప్పారు. ధన్యవాదాలు.
ReplyDeleteగుళ్ళపూడి శ్రీనివాసకుమార్ గారు, చీమకుర్తి బి.రావ్ గారు ఇద్దరికీ ధ్యాంక్యూ అండి. మీ లాంటి వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే ఇలాంటివి ఇంకొన్ని అందించగలనని ఆశిస్తున్నాను....
ReplyDeleteGood one. Thanks for the post.
ReplyDelete