May 25, 2012

స్నేహమంటే


నీ కళ్ళలో కన్నీరులా జారి..
మనసులో భావంగా మారి...
నీ ఊపిరిలో శ్వాసగా చేరి..
ప్రాణం ఉన్నంత వరకూ స్నేహితునిగా ఉంటా నేస్తమా.....

     స్నేహమంటే కలిసి తిరగడం... షికార్లు కొట్టడం... సరదాగా గడపడం కాదు. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి మెలగడం అంతకన్నా కాదు. మనసు విప్పి మాట్లాడుకోడానికి... మనసును తేలిక పరచుకుని ఊరట పొందడానికి... తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగడానికి దారి చూపగల మోరల్‌ గైడెన్స్‌ స్నేహం. 'మేం స్నేహితులం' అని మాటవరసకు చెప్పుకుంటే సరిపోదు. సరైన సమయంలో సరిగ్గా స్పందించి నడిపించగల శక్తి స్నేహంలో కనిపించాలి.



మనకు ఎందరో పరిచయం అవుతుంటారు
అందులో కొందరే మంచి స్నేహితులవుతారు
మనతో మంచి చెడు పంచుకుంటూ
మంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా...




"ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"... 





10 comments:

  1. నిజం చాలా చక్క గా చెప్పారు స్నేహం గురించి.
    మొదటి నాలుగు వాక్యాలు చాలు మీకు స్నేహం పై విలువ చెప్పడానికి...అర్భుతం సాయి గారు
    మరో సారి సూపర్ గా రాసారు...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు.. సీతగారు...

      Delete
  2. అన్నిటిలోలా స్నేహాల్లోనూ చెడూ, మంచీ అని రెండు రకాలున్నాయి. చివరికి నిలిచేదీ, మిగిలేదీ మంచి మాత్రమే.
    నిజమైనది ఎప్పుడూ మంచిదే. అలాగే నిజమైన స్నేహం కలకాలం నిలిచి ఉంటుంది.
    మంచిఉ స్నేహం ఎదురవ్వటం అదృష్టమే...దాన్ని జీవితాంతమూ నిలుపుకోగలగటమూ మరింత అదృష్టం.
    చాలా చక్కగా చెప్పారు, స్నేహాన్నీ, ఆ మంచి భావాన్నీ...

    ReplyDelete
    Replies
    1. పండు గారు.. నిజమే చివరకి నిలిచేది మంచి స్నేహం మాత్రమే..
      ధ్యాంక్యూ అండి. నాపోస్టుకన్నా మీ కామెంటే బాగుంది...

      Delete
  3. చెప్పాలంటే.. గారు, రవిశేఖర్ గారు.. ధ్యాంక్యూ సో.. మచ్... అండి..

    ReplyDelete
  4. Sir, సృష్టి లో తీయనిది స్నేహమే అన్నారు, దానికి మీ కవిత మెరుగులు దిద్దింది . నాలుగు లైన్లు లో చక్కగా వివరించారు .

    ReplyDelete
    Replies
    1. wow.. super andi

      http://telugublogreviews.blogspot.in/2012/05/blog-post_9196.html

      Delete
    2. ఫాతిమ గారు.. ధన్యవాదాలు...

      రాజ చంద్రగారు.. బ్లాగు రివ్యూలో నా బ్లాగును గురించి రాసినందుకు. చాలా చాలా సంతోషంగా ఉంది.. కానీ నాకు అంత అర్హత లేదేమో.. పిచ్చి పిచ్చి విషయాలు రాసుకొనే నన్ను కూడా అభిమానిస్తున్నందుకు.... చాలా సంతోషం...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...