May 17, 2012

నరులారా నేడువో నారసింహ జయంతి -- అన్నమాచార్య సంకీర్తనలు



Download (G. Bala Krishna Prasad)


నరులారా నేడువో నారసింహ జయంతి |
సురలకు ఆనందమై శుభము లొసగెను ||



సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివారం
మందు సంధ్యాకాలమున ఔభళేశుడు |
పొందుగా కంభములో పొడమి కడప మీద
కందువ గోళ్ళ చించె కనక కశిపుని ||


నరమృగరూపము నానాహస్తముల
అరిది శంఖచక్రాది ఆయుధాలతో |
గరిమ ప్రహ్లాదుని కాచి రక్షించి నిలిచె
గురుతర బ్రహ్మాండ గుహలోనను ||


కాంచనపు గద్దెమీద గక్కున కొలువైయుండి
మించుగ ఇందిర తొడమీద బెట్టుక  |

అంచె శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుండై

వంచనసేయక మంచి వరాలిచ్చీ నిదివో ||






1 comment:

  1. మే 5 తేదీ చెయ్యవలసిన పోస్టు.. ఇప్పటికి కుదిరింది.....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...