June 9, 2012

ప్రకృతి నా నేస్తం

 
తెల్లవారుతుండగానే 
ఉదయభానుడు తన లేలేత కిరణాలతో  లేవగొట్టి గుడ్ మార్నింగ్ అన్నాడు.

చిన్నగా  లేచి,  పిల్ల కాలువలో నిలబడితే
చల్లని నీరు  నా పాదాలు తాకుతూ జలజలా అంటూ లయబద్దంగా పలకించింది

పనికని పొలం దగ్గరికెళ్తే 
పిల్లగాలి, ఎలా ఉన్నావంటూ  నా మేను   నిమిరుతూ సాగిపోయింది...

నా అరి కాళ్లతో భూమిని పలకరించితే
గడ్డిపూలు కదుపుతూ భూమాత  హాయ్ అని చెప్పింది.


ఎండకి తాలలేక చెట్టుకిందకెళ్తే
చెట్టు తన కొమ్మలను వింధ్యామరలు చేసి  వీచింది
దానిపై పక్షులు కిలకిలా అంటూ నాతో మాటలు కలిపి అలసట తీర్చాయి..

సాయంత్రం  సముద్రతీరం చేరితే
అలలతో హొయలుపోతూ హౌ ఆర్ యూ అంది....

అబ్బా... ఇక తాపం తట్టుకోలేను అనగానే.. 
భానుడిని  డ్యూటీ దించి తను చార్చి తీసుకొని తెల్లని  వెన్నెల కురింపించాడు మా మామ(చందమామ)

కొలిమిలా కాలిన నేలను చల్లార్చడానికి 
వర్షపు చినుకులు చిటపడ రాలుతూ నాకు  చెక్కిలిగిలి పెట్టాయి...
 
చూసే మనసుండాలే కానీ ప్రకృతి లో ఎక్కడ చూసినా " స్నేహ భావమే" తొనికిసలాడుతుంది........... కాదంటారా ?


24 comments:

  1. సాయి గారూ.....
    చక్క గా రాసారు...నిజమే స్నేహం అనేది ప్రక్రుతి లో నుండి ఆవిర్భవించిందే...

    "అబ్బా... ఇక తాపం తట్టుకోలేను అనగానే..
    భానుడిని డ్యూటీ దించి తను చార్చి తీసుకొని తెల్లని వెన్నెల కురింపించాడు మా మామ(చందమామ"

    చక్కని ఆలోచన ......అంత కన్నా చక్కని కవిత..... !!
    --సీత

    ReplyDelete
    Replies
    1. సీత గారు ఏదో అనిపించింది రాసేసాను అండి.. ధ్యాంక్యూ వెరీమచ్...

      మీరు ఆ లైన్ ఎందుకు పట్టుకున్నారో నాకు తెలుసులేండి.....

      Delete
    2. Mi Kavita Na manasuloki cherindi antha bagundi thank you


      Delete
  2. Replies
    1. భాస్కర్ గారు ధన్యవాదాలు అండి...

      Delete
  3. సాయి గారూ, కవిత అంత అందంగా చెప్పి కాదనగలరా అంటే ఎలా అంత సాహసం చేయగలమా ? నిజమే ప్రకృతి మనకు నేస్తమే. చాలా బాగారాసారు

    ReplyDelete
    Replies
    1. ఫాతిమ గారు.......... మీరు మరీ నండి...

      ధ్యాంక్యూ వెరీమచ్....

      Delete
  4. ప్రకృతిని నేస్తంగా భావిస్తే మానవుడి కష్టాలు చాలా వరకు తీరతాయి.చక్కని కవిత్వం .

    ReplyDelete
    Replies
    1. నిజమే రవిశేఖర్ గారు.... ప్రకృతిని నేస్తం గా భావించాలి...
      ధ్యాంక్యూ వెరీమచ్ అండి

      Delete
  5. మంచి పోలిక. చక్కగారాసారు!

    ReplyDelete
    Replies
    1. ప్రద్మార్పిత గారు.. ధ్యాంక్యూ సో మచ్.....

      Delete
  6. బాగుంది సాయిగారూ...చివరి ఆంగ్లపదాలు కూడా తెలుగీకరించితే ఇంకా హృద్యంగా వుండేది అని నా భావం..అబినందనలతో..

    ReplyDelete
    Replies
    1. నిజమే వర్మగారు...... ఈ సారికి ఇలా వచ్చేసింది.. ఇకపై పూర్తిగా తెలుగులోనే రాసేలా ప్రయత్నిస్తాను
      ధ్యాంక్యూ వెరీమచ్...

      Delete
  7. Replies
    1. ధన్యవాదాలు మంజు గారు........

      Delete
  8. Replies
    1. durgeswara గారు ధ్యాంక్యూ అండి...
      హరిసేవ బ్లాగులో మాకోసం మంచి మంచి విషయాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు..

      Delete
  9. చాలా బాగుంది సాయి గారూ!
    బాగా వ్రాసారు... :-






    చాలా బాగుంది సాయి గారూ!
    బాగా వ్రాసారు.. :-)
    @శ్రీ






    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్యూ వెరీమచ్ శ్రీ గారు..

      Delete
  10. ఎంత బాగా రాశారండి!బాగా నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. లక్షీదేవి గారు. అంతగా నచ్చినందుకు.. ధన్యవాదాలు అండి...

      Delete
  11. naaku prakruti gurinchi konni katalu kavali

    ReplyDelete
  12. చాలా బాగుంది అండి

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...