March 6, 2012

అన్నింటికీ అబద్దమేనా ?


ఈ లోకంలో ఏ పని జరగాలన్నా, ఆఖరికి స్నేహం కావాలన్నా.. అబద్దమే శరణ్యమా ?....  అదే కరెక్ట్ అయితే అలాంటి స్నేహం నాకొద్దు....

స్నేహం పెరగాలన్నా అబద్దమే మార్గం అనుకుంటా... మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది మాత్రం నిజం... 
ఉదా: మీ స్నేహితుడు నేను ఎలా ఉన్నాను..బాగున్నానా ? అని అడిగితే, "చీ నువ్వేం బాగున్నావురా? ఏడ్చినట్టు ఉన్నావు  రా...." అని నిజం చెప్తే  దాదాపు ఎవ్వరూ స్నేహం చెయ్యరు మీతో.. ( ఏదో కొందరు వీడు నిజం చెప్పాడు..ఇలాంటి వాడే నాకు ఫ్రెండ్ గా కావాలి అనుకొనే వారు తప్పితే )

ఇలా చిన్న విషయం దగ్గరనుండి పెద్దవిషయం దాకా ప్రతి ఒక్కదానికి అబద్దం చెప్పడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది... ఈ లోకంలో ఒక మనిషి మనకు దగ్గర అవ్వాలి అంటే  అబద్దాలు ఆడడం ఒక్కటే మార్గం అంటే మటుకు అలాంటి స్నేహాన్ని వదులుకోవడమే బెటర్ అని నా అభిప్రాయం.....

ఎవరితో నైనా మాటలు పెంచాలి అంటే అబద్దం.. మాటలు తుంచాలి అంటే అబద్దం.. 

అబద్దం మాట్లాడ కూడదా? అంటే మాట్లాడచ్చు.. దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది..  దాన్ని “సత్యం” కు గల గొప్పతనం అనే  నా పాత పోస్టులో  చూడగలరు...

కానీ ఒక్క విషయం ఇప్పుడు ఈ అబద్దం వల్ల కొందరి స్నేహితులు దగ్గర అయి ఉండచ్చు.. కానీ మీరు చెప్పిన అబద్దం ఏదో ఒకరోజు బయటపడినప్పుడు , ఆ స్నేహం దూరమై.. నేను అప్పుడు అలా ఎందుకు అబద్దం ఆడానా అని బాధపడి ఏ ప్రయోజనం ఉండదు......


గుండెల్లో మనపై చెప్పలేంత కసి, క్రోధం పెంచుకొని పైకి మాత్రం పెదాలపై నవ్వులు చిలకరిస్తూ..... అదనుకోసం చూస్తూ, అవకాశం వచ్చినప్పుడు తమ కసినంతా ఒక్కసారిగా వెళ్ళగక్కే వారు నిజమైన స్నేహితులేనా?....



March 4, 2012

Computer ను SafeMode లో ఎలా ఓపెన్ చెయ్యాలి


కంప్యూటర్ లో ఏదైనా Device Drivers కానీ, కొన్ని రకాల Software's కానీ install చేసినప్పుడు.. వాటిలో కొన్ని windows లోని ఏదైనా ముఖ్యమైన ఫైల్స్ ను మార్చడం వల్ల, లేదా ఆ Device Drivers సరిగా install అవ్వకపోయినా Windows లోడ్ కాదు...

అంటే ఆ ఫైల్స్ లోడ్ అవ్వక కంప్యూటర్ కొన్నిసార్లు బూట్ కూడా అవ్వలేదు..నిలిచిపోతుంది.. అలాంటి సందర్భాలలో కంప్యూటర్ లో కావల్సిన Drivers మాత్రమే లోడ్ చేసి ఇంతకు ముందు మనం చేసిన మార్పులను సరిచెయ్యడానికి అవకాశం కల్పించేది SafeMode అనేది....

ఒక్కమాటలో చెప్పాలంటే కంప్యూటర్ క్రిటికల్ ప్రాబ్లంస్ కు గురైనప్పుడు దాన్ని Troubleshoot చెయ్యడానికి వీలుకల్పించేదే safeMode అన్నమాట.

ఇలా సేఫ్‍మోడ్ లో ఓపెన్ చెయ్యడమ్ చాలా మందికి తెలిసే ఉంటుంది.. కానీ తెలియని వాళ్ళకోసం ఈ పోస్టు..


1. కంప్యూటర్ ను రీస్టార్ట్ చెయ్యండి.
2. వెంటనే మీ కీ బోర్డుమీద ఉన్న F8 కీ ని ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ఒక స్రీన్ చూపిస్తుంది.





3. దానిలో SafeMode అనే ఆప్షన్ select చెయ్యండి. (కీబోర్డు మీద ఉన్న arrow keys ఉపయోగించాలి)

అప్పుడు కంప్యూటర్ సేఫ్ మోడ్ లో ఓపెన్ అవుతుంది.


సో ..మీరు ఏదైనా software install చెయ్యడం వల్ల ఇలాంటి పరిస్డితి వచ్చి ఉంటే add/remove programs లోకి వెల్లి ఆ ప్రోగ్రామ్స్ uninstall చేస్తే సరిపోతుంది..
ఇంకా దీనిద్వారా ఇంకా ఏం చెయ్యచ్చో తరువాత పోస్టులలో రాస్తాను.....


మీకు తెలుసా ఈ మోడ్ లో ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి.
1. autoexec.bat , config.sys అనే పైల్స్ లోడ్ కావు...
2. అన్ని Device drivers లోడ్ కావు..
3. నార్మల్ గ్రాఫిక్స్ మోడ్ కాకుండా ఇది VGA graphics mode అనేదాన్ని ఉపయోగిస్తుంది.
4. system.ini అనే పైల్ బదులుగా system.cb అనే పైల్ లోడ్ అవుతుంది. అది Virtual Device Drivers (VxDs) అనే దాన్ని లోడ్ చేస్తుందన్నమాట. ఈ పైల్ కంప్యూటర్ standard parts తో మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది.
5. ఈ మోడ్ లో 16 రంగులు 640 x 480 resolution మాత్రమే లభిస్తుంది... నాలుగు మూలలా safemode అని రాసి ఉంటుంది.

టైపింగ్ నేర్చుకోవడానికి మంచి Website

నేను ఈ రోజు ఈ సైట్ చూసాను...


ఆన్‍లైన్ లో  టైపింగ్ నేర్చుకోవడానికి   http://typingclub.com/   అనే ఉచిత   సైట్ చాలా బాగుంది... ఒక్కొక్క లెసన్ కంప్లీట్ చేసాక ఇంకోటి ఒపెన్ అవుతుందన్నమాట...  

Social Networking సైట్ల నుండి వచ్చే Notification మెయిల్స్ ఇబ్బందిగా ఉన్నాయా?

                                 


మనకు రకరకాల సోషల్‍నెట్‍వర్కింగ్ సైట్ల నుండీ.. ఫలానా వాళ్ళు ఇలా కామెంట్ రాసారు... అంటూ రకరకాల మెయిల్స్ వచ్చి విసిగిస్తూ ఉంటాయి.. Face Book లో అయితే ఒకరికి కామెంట్ రాసి Unfollow చెయ్యడం మరిస్తే ..దానికింద ఇంకెవ్వరు కామెంట్ రాసిన మెయిల్ వచ్చి ఇబ్బందిగా ఉంటుంది..

Face Book లో ఫ్రెండ్స్ Updates ని ఆటోమాటిక్ గా like చేసేయ్యాలంటే


Face Book లో Friends అందరూ రకరకాల అప్‍డేట్స్ చేస్తుంటారు.. వాటిని Like చేసిన ఫ్రెండ్స్ ని ఇష్టపడతారు.. కానీ మీకు అలా అన్నింటినీ చదివి లైక్ చేసే ఓపెక లేదు అనుకోండి.. మీ క్రోమ్ బ్రౌజర్ కు ఇక్కడ నుండి చిన్న ఆడాన్ install చేసుకుంటే ఇకపై అన్నింటిని ఆటోమాటిక్ గా లైక్ చెయ్యవచ్చు...



Related Posts Plugin for WordPress, Blogger...