March 24, 2012

ఇంటర్నెట్ కనెక్షన్ Slow గా ఉందా వీడియోలను ఇలా చూడండి


 

ఒకవేళ మీకు ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉంటే యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నప్పుడు అవి ఆగి ఆగి (Buffer) రావడం గమనించే ఉంటారు...
ఇలా రాకుండా ఉండేందుకు వీడియో క్వాలిటీ ని 240p లేదా 360p గా కానీ ఎంచుకుంటూ ఉంటాం..
ప్రతి సారీ ఇలా వీడియో క్వాలిటీని సెలెక్ట్ చెయ్యడం కష్టం గా ఉంటే ఈ Chrome extension ను install చేసుకోండి.. అదే ఇక ఉన్న క్వాలిటీలు అన్నింటిలో తక్కువది ఎంచుకొని మనకు వీడియోలు చూపిస్తుంది..

ఇక్కడ నుండి ఇస్‍స్టాల్ చేసుకోండి: Click To add Chrome extension


అదిసరే అలా తక్కువ క్వాలిటీలోనే Full screen మోడ్ లో వీడియో చూడాలి అంటే ఎలా...?

 ఏంలేదు ఈ extension వేసుకుంటే సరిపోతుంది.. Click here to add Chrome Extension 





Thanks.. Good bye.....

source:

https://chrome.google.com/webstore/detail/mnnigofcppdedajacenolhffbknmjpag/
https://chrome.google.com/webstore/detail/filcaigohbbmpjggnbfagfioljhpebdf 
 

March 23, 2012

Twitter లో మిమ్మల్ని Follow అవ్వని ఫ్రెండ్స్ ను తెలుసుకోవాలి అంటే..



మీ Twitter అకౌంట్ లో మీరు ఎందరో ఫ్రెండ్స్ ను ఫాలో అవుతుంటారు. కానీ వారిలో కొందరు మీ ఫ్రెండ్సే అయినా మిమ్మల్ని ఫాలో అవ్వకుండా ఉండుండచ్చు.. అలాంటి వాళ్ళను కునుక్కోవాలి అంటే...

http://www.friendorfollow.com/  అనే సైట్ కు వెళ్ళండి.

అక్కడ మీ ట్విట్టర్ యూజర్ నేమ్ ఎంటర్ చెయ్యండి.. చాలు.. (లాగాన్ కూడా అవ్వనవసరంలేదు)
వెంటనే మిమ్మల్ని ఫాలో అవ్వని మీ ఫ్రెండ్స్ లిస్టుని చూపిస్తుంది..

March 22, 2012

నా ఉగాది శుభాకాంక్షలు...





తెలుగు వారి తొలిపండుగ ఉగాది
షడ్రుచుల సమ్మేళనం ఉగాది
కోయిల కుహూకుహూ రాగాలకు అంతరార్దం ఉగాది
కొమ్మల చిగురుల వన్నెలకు అర్దం ఉగాది
పాడిపంటల పచ్చదనాలకు, రైతన్నల ఆనందాలకు ఆలంబనం ఉగాది
ఆటపాటలకు, సప్తస్వర సమ్మేళనాలకు, పంచాంగ శ్రవణాలకు వేదిక ఉగాది
నూతన ఆశలను, కోట్లు కుమ్మరించినా కొనలేని ఆనందాలను అందించేను ఈ ఉగాది
అందుకే సాదరంగా సాగనంపండి ఆఖరను
ఉప్పొంగిన ఆనందంతో వెల్లివిరిసిన సంతోషంతో ఆహ్వానించండి ఈ నందనం ను మీ 
ఇంట  ఆనందం నింపాలని....
నందన వనంలో మనజీవనం నవనవ లాడాలని ఆశిస్తూ.....

--సాయి

March 21, 2012

ఏ వెబ్‍సైట్‍ను అయినా మీకు కావల్సిన విధంగా మార్చుకోండి.


  
    మనం మామూలుగా రకరకాల వెబ్‍సైట్ల లోని మేటర్ ను ప్రింట్ తీస్తూ ఉంటాం.. కానీ వాటిని కొంచెం మార్చుకొని మీకు కావలసిన రంగులలో టెక్ట్స్ , ఇమేజస్ పెట్టుకొని ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ..
ఈ క్రోమ్ extension చాలా బాగా ఉపయోగపడుతుంది..

March 19, 2012

Skype Offline setup file కావాలంటే...

 

ఆడియో, వీడియో చాటింగ్ అవసరలాకు Skype ని వాడేవారు...

http://www.skype.com/intl/en/get-skype/on-your-computer/windows/  ఆనే లింకు నుండి setup పైల్ ను Download చేసుకుంటూ ఉంటారు.. కదా 

అయితే అది నేరుగా ఆన్‍లైన్ నుండి ఇన్‍స్టాల్ అవుతుంది.. నెట్ కనెక్షన్ లేని కంప్యూటర్స్ లో install చేసుకోవడానికి offline setup file కావాలంటే

డైరక్ట్ లింకు: http://download.skype.com/SkypeSetupFull.exe

సాప్ట్‍పీడియాలింకు: http://www.softpedia.com/dyn-postdownload.php?p=7034&t=4&i=1

నుండి Download చేసుకోని వాడుకోవచ్చు

March 18, 2012

Twitter లో Inactive గా ఉన్న ఫ్రెండ్స్ ని తీసేయ్యడం



మీరు రెగ్యులర్ గా ట్విట్టర్ వాడేవారు అయితే ఎప్పుడూ ట్విట్టర్ ని అప్‍డేట్ చెయ్యని ఫ్రెండ్స్ ఎవరు అని తెలుసుకొని వారిని unfollow చేసుకోవడానికి http://untweeps.com/ అనే  ఈ సైట్ లోకి వెళ్ళండి..

ఫేస్ బుక్ లో చాటింగ్ లో వాడేందుకు కొన్ని Smiley codes....



మీరు ఫేస్ బుక్ లో చాటింగ్ చేసే సమయంలో ఈ కోడ్స్ ని పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే  ఇలా  ఆ emotions అక్కడ కన్పిస్తాయి....

March 15, 2012

FRIENDS FOREVER

FRIENDS FOREVER

        Mother is the sweetest word in the world, next comes FRIENDS. If mother gives life, friends help to live the life. They are true gifts of god. We can’t choose our parents, brothers, sisters, relatives but we can choose our friends, Good and bad you can share it only with a friend. It can exist between any two souls be it between people or men or animals. It can happen at any time at anywhere. True friends always sail on a great ship, which never sink called friendship.

March 6, 2012

అన్నింటికీ అబద్దమేనా ?


ఈ లోకంలో ఏ పని జరగాలన్నా, ఆఖరికి స్నేహం కావాలన్నా.. అబద్దమే శరణ్యమా ?....  అదే కరెక్ట్ అయితే అలాంటి స్నేహం నాకొద్దు....

స్నేహం పెరగాలన్నా అబద్దమే మార్గం అనుకుంటా... మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది మాత్రం నిజం... 
ఉదా: మీ స్నేహితుడు నేను ఎలా ఉన్నాను..బాగున్నానా ? అని అడిగితే, "చీ నువ్వేం బాగున్నావురా? ఏడ్చినట్టు ఉన్నావు  రా...." అని నిజం చెప్తే  దాదాపు ఎవ్వరూ స్నేహం చెయ్యరు మీతో.. ( ఏదో కొందరు వీడు నిజం చెప్పాడు..ఇలాంటి వాడే నాకు ఫ్రెండ్ గా కావాలి అనుకొనే వారు తప్పితే )

ఇలా చిన్న విషయం దగ్గరనుండి పెద్దవిషయం దాకా ప్రతి ఒక్కదానికి అబద్దం చెప్పడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది... ఈ లోకంలో ఒక మనిషి మనకు దగ్గర అవ్వాలి అంటే  అబద్దాలు ఆడడం ఒక్కటే మార్గం అంటే మటుకు అలాంటి స్నేహాన్ని వదులుకోవడమే బెటర్ అని నా అభిప్రాయం.....

ఎవరితో నైనా మాటలు పెంచాలి అంటే అబద్దం.. మాటలు తుంచాలి అంటే అబద్దం.. 

అబద్దం మాట్లాడ కూడదా? అంటే మాట్లాడచ్చు.. దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది..  దాన్ని “సత్యం” కు గల గొప్పతనం అనే  నా పాత పోస్టులో  చూడగలరు...

కానీ ఒక్క విషయం ఇప్పుడు ఈ అబద్దం వల్ల కొందరి స్నేహితులు దగ్గర అయి ఉండచ్చు.. కానీ మీరు చెప్పిన అబద్దం ఏదో ఒకరోజు బయటపడినప్పుడు , ఆ స్నేహం దూరమై.. నేను అప్పుడు అలా ఎందుకు అబద్దం ఆడానా అని బాధపడి ఏ ప్రయోజనం ఉండదు......


గుండెల్లో మనపై చెప్పలేంత కసి, క్రోధం పెంచుకొని పైకి మాత్రం పెదాలపై నవ్వులు చిలకరిస్తూ..... అదనుకోసం చూస్తూ, అవకాశం వచ్చినప్పుడు తమ కసినంతా ఒక్కసారిగా వెళ్ళగక్కే వారు నిజమైన స్నేహితులేనా?....



March 4, 2012

Computer ను SafeMode లో ఎలా ఓపెన్ చెయ్యాలి


కంప్యూటర్ లో ఏదైనా Device Drivers కానీ, కొన్ని రకాల Software's కానీ install చేసినప్పుడు.. వాటిలో కొన్ని windows లోని ఏదైనా ముఖ్యమైన ఫైల్స్ ను మార్చడం వల్ల, లేదా ఆ Device Drivers సరిగా install అవ్వకపోయినా Windows లోడ్ కాదు...

అంటే ఆ ఫైల్స్ లోడ్ అవ్వక కంప్యూటర్ కొన్నిసార్లు బూట్ కూడా అవ్వలేదు..నిలిచిపోతుంది.. అలాంటి సందర్భాలలో కంప్యూటర్ లో కావల్సిన Drivers మాత్రమే లోడ్ చేసి ఇంతకు ముందు మనం చేసిన మార్పులను సరిచెయ్యడానికి అవకాశం కల్పించేది SafeMode అనేది....

ఒక్కమాటలో చెప్పాలంటే కంప్యూటర్ క్రిటికల్ ప్రాబ్లంస్ కు గురైనప్పుడు దాన్ని Troubleshoot చెయ్యడానికి వీలుకల్పించేదే safeMode అన్నమాట.

ఇలా సేఫ్‍మోడ్ లో ఓపెన్ చెయ్యడమ్ చాలా మందికి తెలిసే ఉంటుంది.. కానీ తెలియని వాళ్ళకోసం ఈ పోస్టు..


1. కంప్యూటర్ ను రీస్టార్ట్ చెయ్యండి.
2. వెంటనే మీ కీ బోర్డుమీద ఉన్న F8 కీ ని ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ఒక స్రీన్ చూపిస్తుంది.





3. దానిలో SafeMode అనే ఆప్షన్ select చెయ్యండి. (కీబోర్డు మీద ఉన్న arrow keys ఉపయోగించాలి)

అప్పుడు కంప్యూటర్ సేఫ్ మోడ్ లో ఓపెన్ అవుతుంది.


సో ..మీరు ఏదైనా software install చెయ్యడం వల్ల ఇలాంటి పరిస్డితి వచ్చి ఉంటే add/remove programs లోకి వెల్లి ఆ ప్రోగ్రామ్స్ uninstall చేస్తే సరిపోతుంది..
ఇంకా దీనిద్వారా ఇంకా ఏం చెయ్యచ్చో తరువాత పోస్టులలో రాస్తాను.....


మీకు తెలుసా ఈ మోడ్ లో ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి.
1. autoexec.bat , config.sys అనే పైల్స్ లోడ్ కావు...
2. అన్ని Device drivers లోడ్ కావు..
3. నార్మల్ గ్రాఫిక్స్ మోడ్ కాకుండా ఇది VGA graphics mode అనేదాన్ని ఉపయోగిస్తుంది.
4. system.ini అనే పైల్ బదులుగా system.cb అనే పైల్ లోడ్ అవుతుంది. అది Virtual Device Drivers (VxDs) అనే దాన్ని లోడ్ చేస్తుందన్నమాట. ఈ పైల్ కంప్యూటర్ standard parts తో మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది.
5. ఈ మోడ్ లో 16 రంగులు 640 x 480 resolution మాత్రమే లభిస్తుంది... నాలుగు మూలలా safemode అని రాసి ఉంటుంది.

టైపింగ్ నేర్చుకోవడానికి మంచి Website

నేను ఈ రోజు ఈ సైట్ చూసాను...


ఆన్‍లైన్ లో  టైపింగ్ నేర్చుకోవడానికి   http://typingclub.com/   అనే ఉచిత   సైట్ చాలా బాగుంది... ఒక్కొక్క లెసన్ కంప్లీట్ చేసాక ఇంకోటి ఒపెన్ అవుతుందన్నమాట...  

Social Networking సైట్ల నుండి వచ్చే Notification మెయిల్స్ ఇబ్బందిగా ఉన్నాయా?

                                 


మనకు రకరకాల సోషల్‍నెట్‍వర్కింగ్ సైట్ల నుండీ.. ఫలానా వాళ్ళు ఇలా కామెంట్ రాసారు... అంటూ రకరకాల మెయిల్స్ వచ్చి విసిగిస్తూ ఉంటాయి.. Face Book లో అయితే ఒకరికి కామెంట్ రాసి Unfollow చెయ్యడం మరిస్తే ..దానికింద ఇంకెవ్వరు కామెంట్ రాసిన మెయిల్ వచ్చి ఇబ్బందిగా ఉంటుంది..

Face Book లో ఫ్రెండ్స్ Updates ని ఆటోమాటిక్ గా like చేసేయ్యాలంటే


Face Book లో Friends అందరూ రకరకాల అప్‍డేట్స్ చేస్తుంటారు.. వాటిని Like చేసిన ఫ్రెండ్స్ ని ఇష్టపడతారు.. కానీ మీకు అలా అన్నింటినీ చదివి లైక్ చేసే ఓపెక లేదు అనుకోండి.. మీ క్రోమ్ బ్రౌజర్ కు ఇక్కడ నుండి చిన్న ఆడాన్ install చేసుకుంటే ఇకపై అన్నింటిని ఆటోమాటిక్ గా లైక్ చెయ్యవచ్చు...



Related Posts Plugin for WordPress, Blogger...