October 16, 2020

YouTube లో Shorts తయారు చేయడం ఎలా ?

 

హలో అండీ, అందరూ ఎలా ఉన్నారు ? 

ఈ రోజు ఈ పోస్టులో YouTube కొత్తగా ఇండియాలో రిలీజ్ చేసిన Shorts ,  చిన్న వీడియోలు ఎలా చెయ్యలో చెప్పబోతున్నాను. 

ఇలా టిక్ టాక్ లాంటి చిన్న వీడియోలను చెయ్యడం వలన మీ లోని టాలెంట్ ప్రపంచానికి తెలియడమే కాకుండా, మీకు Subscribers కూడా పెరుగుతారు. 

ఈ క్రింద ఉన్న వీడియోలో మీకు అన్ని వివరాలు చెప్పాను.  వినగలరు. 




మీరు చేసే వీడియోలు సందేశాత్మకంగాను, ఉపయోగకరంగాను ఉంటాయని ఆశిస్తున్నాను. 

మీకోసం ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాల్ను రాయలని అనుకుంటున్నాను. మీరేమంటారు ? 

January 24, 2016

Bitdefender antivirus ఉచితంగా మీకోసం



  ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యడం ద్వారా మీరు ఈ ఆఫర్ ని పొందగలరు.  

http://gvsai.blogspot.in/2016/01/bitdefender-internet-security-giveaway.html

June 15, 2012

అది నాకు సాధ్యమేనా ?


గుప్పెడంత గుండెను,
దొసెడంత మనసును,
చెరగని చిరునవ్వులను,
వెచ్చని ఆశ్లేషములను  ఇవ్వాలని ఉంది


తరగని ప్రేమను,
అంతులేని ఆనందాలను,
మరపురాని మమతలను,
అపురూపమైన అనురాగాలను  కుమ్మరించాలని ఉంది.


స్వార్ధపు సామ్రాజ్యములను,
విషపు చూపుల శరాలను,
మాటలు చేసిన గాయాలను,
బాధలు చేసిన తీరువులను సమూలంగా  తుడిచేయ్యాలని ఉంది.


సంకుచిత భావనలను,
విషాదపు రోదనలను,
ఒంటరితనపు భావాలను,
మదిలో  నిండిన మౌనాన్ని   దూదిపింజల్లా ఎగరగొట్టాలని ఉంది.


అరమరికలు లేని నవ్వులకోసం.
బుల్లి బుల్లి సంతోషాల కోసం,
సరికొత్తకలలను మోసుకొచ్చే అలల కోసం,
వెలుగు చూడని పాషణ రాత్రులను పారద్రోలే కాంతి కిరణాల కోసం ఎదురుచూడాలని ఉంది


మతం అనే తుపాకీ చేసే మారణహోమాలు లేని,
కులం మత్తెక్కిన కీచకులుండని,
మోసపు మనుగడలు మచ్చుకైనా ఉండని,
విజ్ఞానపు వెలుగులు వెదజల్లే,
మానవత్వంతో మెసలే మనుషులు ఉండే  సరికొత్త సమాజం నిర్మించాలని ఉంది.

ఇవ్వన్నీ సాధ్యమేనా ?


మీకు తెలుసా ?  ఇది నా 200 పోస్టు... 100 కంప్యూటర్ టిప్స్ కూడా ఈ రోజుతో పూర్తి  అయ్యాయి..
మీ అమూల్యమైన కామెంట్ తెలుపగలరు..

FaceBook ఫ్రెండ్స్ ని ఇలా ఆటపట్టించండి..



Face Book లో నేను రాసిన Status ను 5200 మంది like చేసారు..


నిజానికి నాకున్న  ఫ్రెండ్స్  120 మందే ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ?

మీరూ  http://www.fakebookstatus.com/  అనే సైట్ కి వెళ్లి ఎన్ని లైక్ లు. కామెంట్లు కావాలో రాసుకొని  మీ ఫ్రెండ్స్ మోసం చెయ్యండి...


PDF files బ్రౌజర్ లో ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే..


Chrome Browser లో Built-in  పీడీఫ్   viewer ఉండడం వల్ల  బ్రౌజర్ లోనే PDF  ఫైల్స్  ఓపెన్ అవుతాయి... పెద్దపెద్ద  ఫైల్స్  ఉన్నప్పుడు అది ఇబ్బంది కరంగా ఉంటుంది కదా.... 
Related Posts Plugin for WordPress, Blogger...