May 20, 2011

ఈ తరం స్నేహాలు


           స్నేహమంటే జీవితం.... స్నేహమంటే శాశ్వతం ఎప్పుడో పాత సినిమాలో విన్నట్టు గుర్తు....కానీ ఈ తరం స్నేహాలు అవసరాలను తీర్చుకోవడం  కోసరమే అన్నట్టుగా మారిపోయాయి...


       ఉదాహరణకు ఒక కాలేజీ విద్యార్దులనే  తీసుకుంటే.....కాలేజీ ఉన్నన్ని రోజులు వాల్ల మధ్య ఎస్ యం ఎస్ లు, ఫోన్లు అన్నీ ఉంటాయి...కానీ అది పుర్తి అయిన తరువాత మాత్రం పోన్ చేసినా సరిగా పలకరించలేనంత బిజీ మనుషులం...ఇలాంటి ఆలోచనే కలిగిన వారిపై నల్లమోతు శ్రీధర్ గారు రాసిన ఒక వ్యాసం లోని కొన్ని అంశాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను చూడండి....

        ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నో మనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగా తేడా వస్తే చాలు.. ఎలాంటి సంజాయిషీలూ, క్షమించడాలూ లేకుండా క్షణకాలంలో వారికి దూరమైపోతున్నాం. మనస్పర్థ వస్తే చాలు.. తప్పయినా ఒప్పయినా మనం అనుసరించే పద్ధతే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతున్నాం. అందుకే మనసుల మధ్య ఏర్పడే అగాధాన్ని పూడ్చుకోవాల్సింది పోయి మొండిపట్టుదలతో బింకంగా హఠమేస్తున్నాం.. ‘మనకేం అవసరం.. వస్తే వాళ్లే వస్తారులేఅన్న అహం కమ్ముకుపోతుంది

       రైలు ప్రయాణంలో స్టేషన్ వస్తే దిగిపోయే ప్రయాణీకుల్లా అంతే అవలీలగా తప్పుకుపోతున్నాం. మరో రైలు, మరో మజిలీ, మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది. కొత్త మనుషులు కలుస్తూనే ఉంటారు. అవసరాలు తీర్చేసుకుని ఏదో ఒక సాకుతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని దూరమవుతూనే ఉంటారు. స్నేహంలో అవసరాలు ఒక భాగం మాత్రమే.. అవసరాలు తీర్చుకోవడానికే స్నేహం ముసుగు వేసుకోవలసి వస్తే అవసరాలు తీరగానే స్నేహానికి నూకలు చెల్లినట్లే! అందుకే మనుషుల్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, సహకరించుకుందాం.. అంతే తప్ప మనుషుల్ని జీవితంలో పైకెదగడానికి పావులుగా వాడుకునే నైపుణ్యతలు ఎన్ని అలవర్చుకున్నా మనసులో స్వచ్ఛత లేనప్పుడు అనుబంధాలకు బలమెక్కడ?

      అంటే ఒక వ్యక్తి నుంచి మనకు ఉపయోగ పడుతాడు, అతని నుంచి మనకు ఎదో ఒక ప్రతిఫలం వస్తుంది అంటేనే వారితో సంభంధాలు పెట్టుకుంటున్నాం...వారిక మనుకు ఏ విధంగానూ సహాయపడరు అని తెలిసిన మరుక్షణం వారినుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం....ఇదంతా నిజమైన స్నేహమేనంటారా? ఈ తరం వారికి స్నేహం “విలువ” తెలుసునని సంతోషించాలా?................

2 comments:

  1. Very nie article. Now a days there is no value for friendship. People always thinking how to use and throw. Once the work is over , they are throwing in the tarsh regardless of others feelings,no gratitude etc.I had a very bad experiene recently.I felt very bad.That lady used me like anything,once the work was over how she treated me I can't forget in my life. Now I opened my eyes and thanks to god opening my eyes and realise the reality.

    ReplyDelete
  2. ప్రస్తుత స్నేహాల గురించి చక్కగా చెప్పారు.నేను శ్రీధర్ గారి వ్యాసం చదివాను.ఆయన లోతయిన విశ్లేషణ చేస్తారు.స్నేహం గురించి నా బ్లాగు లో వ్యాసాలు రాబోతున్నాయి .మీ సైటు చాలా బాగుంది.మనం మంచిని బ్లాగుల ద్వారా పంచాలి.
    రవిశేఖర్ ఒద్దుల

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...