June 10, 2012

ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల -- (నేను చేసిన వీడియోతో)


ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా ||


కందువ దేవకి బిడ్డగనెనట నడురేయి
అంది యశోదకుకొడుకైనాడట |
సందడించి పూతకిచంటిపాలు తాగెనట
మందల ఆవులగాచి మలసెనట ||


మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట
ఇంచుకంతవేల కొండయెత్తినాడట |
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట
మించుల పిల్లగోవివట్టి మెరసెనటా ||

కాళింగుని మెట్టెనట కంసు( బొరిగొనెనట 
పాలించి సురల చేపట్టెనట  |
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుడట
యేలెనట పదారువేల ఇంతుల నిందరిని ||

నేను చేసిన ఈ వీడియోలో సంకీర్తన వినండి: 



8 comments:

  1. వావ్...........వావ్..............
    వావ్................వావ్.........
    కృష్ణుడి ఫొటో లు ఎంత బాగున్నాయో ............
    సాయి గారూ...చాలా బాగుంది మీ వీడియో+కీర్తన............సూపర్.....!!

    ReplyDelete
    Replies
    1. సీత గారు.... అన్ని వావ్ లా.....
      మీ కృష్ణ భక్తి అలాంటిది లేండీ మరి...
      ధ్యాంక్యూ వెరీమచ్ అండి....

      Delete
  2. nakemo peddaga bhakthi ledandi, kani video editing ante interest,
    anduke video choosa, bhgundandi.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు.. ధ్యాంక్యూ అండి... నిజానికి PPT తోనే ఇంకా అద్భుతంగా చెయ్యాలని start చేసాను.. చివరి నిమిషంలో బెడిసి కొట్టి.. అలా తయారైంది...

      Delete
  3. చాలా బాగుంది మీ ఎడిటింగ్ సాయి గారూ!
    కృష్ణుని చిత్రాలు చాలా బాగున్నాయి...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారు.. ధ్యాంక్యూ అండీ..

      Delete
  4. వీడియో , సంకీర్తనా చాలా బాగున్నాయి.

    ReplyDelete
  5. మాలా కుమార్ గారు.. ధ్యాంక్యూ అండి...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...