June 15, 2012

అది నాకు సాధ్యమేనా ?


గుప్పెడంత గుండెను,
దొసెడంత మనసును,
చెరగని చిరునవ్వులను,
వెచ్చని ఆశ్లేషములను  ఇవ్వాలని ఉంది


తరగని ప్రేమను,
అంతులేని ఆనందాలను,
మరపురాని మమతలను,
అపురూపమైన అనురాగాలను  కుమ్మరించాలని ఉంది.


స్వార్ధపు సామ్రాజ్యములను,
విషపు చూపుల శరాలను,
మాటలు చేసిన గాయాలను,
బాధలు చేసిన తీరువులను సమూలంగా  తుడిచేయ్యాలని ఉంది.


సంకుచిత భావనలను,
విషాదపు రోదనలను,
ఒంటరితనపు భావాలను,
మదిలో  నిండిన మౌనాన్ని   దూదిపింజల్లా ఎగరగొట్టాలని ఉంది.


అరమరికలు లేని నవ్వులకోసం.
బుల్లి బుల్లి సంతోషాల కోసం,
సరికొత్తకలలను మోసుకొచ్చే అలల కోసం,
వెలుగు చూడని పాషణ రాత్రులను పారద్రోలే కాంతి కిరణాల కోసం ఎదురుచూడాలని ఉంది


మతం అనే తుపాకీ చేసే మారణహోమాలు లేని,
కులం మత్తెక్కిన కీచకులుండని,
మోసపు మనుగడలు మచ్చుకైనా ఉండని,
విజ్ఞానపు వెలుగులు వెదజల్లే,
మానవత్వంతో మెసలే మనుషులు ఉండే  సరికొత్త సమాజం నిర్మించాలని ఉంది.

ఇవ్వన్నీ సాధ్యమేనా ?


మీకు తెలుసా ?  ఇది నా 200 పోస్టు... 100 కంప్యూటర్ టిప్స్ కూడా ఈ రోజుతో పూర్తి  అయ్యాయి..
మీ అమూల్యమైన కామెంట్ తెలుపగలరు..

FaceBook ఫ్రెండ్స్ ని ఇలా ఆటపట్టించండి..



Face Book లో నేను రాసిన Status ను 5200 మంది like చేసారు..


నిజానికి నాకున్న  ఫ్రెండ్స్  120 మందే ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ?

మీరూ  http://www.fakebookstatus.com/  అనే సైట్ కి వెళ్లి ఎన్ని లైక్ లు. కామెంట్లు కావాలో రాసుకొని  మీ ఫ్రెండ్స్ మోసం చెయ్యండి...


PDF files బ్రౌజర్ లో ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే..


Chrome Browser లో Built-in  పీడీఫ్   viewer ఉండడం వల్ల  బ్రౌజర్ లోనే PDF  ఫైల్స్  ఓపెన్ అవుతాయి... పెద్దపెద్ద  ఫైల్స్  ఉన్నప్పుడు అది ఇబ్బంది కరంగా ఉంటుంది కదా.... 

June 12, 2012

కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా... కళ్లను ఇలా రక్షించుకోండి



కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటాం....
పగలు చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ రాత్రి సమాయాలలో Screen  చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది.అలాంటప్పుడు brightness తగ్గించుకొని చూస్తుంటాం... 

అలా కాకుండా మనం ఉంటున్న  ప్రదేశం ను బట్టి, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ Brightness, colors మార్చిపెట్టే software ఉంటే బాగుంటుంది కదా..

అలాంటిదే ఈ Flux అనేది. ఇది సూర్యాస్తమయ  సమయాన్ని, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ రంగులు, వెలుగు మార్చి మన కళ్లను రక్షిస్తుంది. కేవలం 546KB మాత్రమే ఉన్న ఈ టూల్ చాలా బాగుంది.

ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.  Click Here

Install చేసుకున్నాక సెట్టింగులలో మీరుంటున్న  లొకేషన్ సెట్ చేసుకోండి.. 









Thanks to hu Blog... 

June 11, 2012

అప్పడుండే కొండలోన ఇప్పపూలు ఏరబోతే ఇప్పపూలు కప్పలాయెరా

FaceBook లో messages అన్నీ ఒకేసారి డిలీట్ చేసుకోవాలంటే..



FaceBook లో మనం చేసిన చాటింగ్స్ , మెసేజ్ లు అన్నీ సేవ్ అయ్యి ఉంటాయి.. వాటిని ఒక్కొక్కటి డిలీట్ చెయ్యాలి అంటే కష్టం గా ఉంటుంది కదా.. ఈ chrome extension వేసుకుంటే మెసేజస్ పక్కన  రెడ్ కలర్ x మార్కు వస్తుంది.. దాన్ని క్లిక్ చేస్తే ఆ వ్యక్తికి చేసిన మెసేజ్ లన్నీ ఒకేసారి డిలీట్ అవుతాయి..

June 10, 2012

ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల -- (నేను చేసిన వీడియోతో)


ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా ||


కందువ దేవకి బిడ్డగనెనట నడురేయి
అంది యశోదకుకొడుకైనాడట |
సందడించి పూతకిచంటిపాలు తాగెనట
మందల ఆవులగాచి మలసెనట ||


మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట
ఇంచుకంతవేల కొండయెత్తినాడట |
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట
మించుల పిల్లగోవివట్టి మెరసెనటా ||

కాళింగుని మెట్టెనట కంసు( బొరిగొనెనట 
పాలించి సురల చేపట్టెనట  |
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుడట
యేలెనట పదారువేల ఇంతుల నిందరిని ||

నేను చేసిన ఈ వీడియోలో సంకీర్తన వినండి: 



June 9, 2012

ప్రకృతి నా నేస్తం

 
తెల్లవారుతుండగానే 
ఉదయభానుడు తన లేలేత కిరణాలతో  లేవగొట్టి గుడ్ మార్నింగ్ అన్నాడు.

చిన్నగా  లేచి,  పిల్ల కాలువలో నిలబడితే
చల్లని నీరు  నా పాదాలు తాకుతూ జలజలా అంటూ లయబద్దంగా పలకించింది

పనికని పొలం దగ్గరికెళ్తే 
పిల్లగాలి, ఎలా ఉన్నావంటూ  నా మేను   నిమిరుతూ సాగిపోయింది...

నా అరి కాళ్లతో భూమిని పలకరించితే
గడ్డిపూలు కదుపుతూ భూమాత  హాయ్ అని చెప్పింది.


ఎండకి తాలలేక చెట్టుకిందకెళ్తే
చెట్టు తన కొమ్మలను వింధ్యామరలు చేసి  వీచింది
దానిపై పక్షులు కిలకిలా అంటూ నాతో మాటలు కలిపి అలసట తీర్చాయి..

సాయంత్రం  సముద్రతీరం చేరితే
అలలతో హొయలుపోతూ హౌ ఆర్ యూ అంది....

అబ్బా... ఇక తాపం తట్టుకోలేను అనగానే.. 
భానుడిని  డ్యూటీ దించి తను చార్చి తీసుకొని తెల్లని  వెన్నెల కురింపించాడు మా మామ(చందమామ)

కొలిమిలా కాలిన నేలను చల్లార్చడానికి 
వర్షపు చినుకులు చిటపడ రాలుతూ నాకు  చెక్కిలిగిలి పెట్టాయి...
 
చూసే మనసుండాలే కానీ ప్రకృతి లో ఎక్కడ చూసినా " స్నేహ భావమే" తొనికిసలాడుతుంది........... కాదంటారా ?


June 7, 2012

FaceBook లో File sharing చేసుకోవచ్చు ఇలా..

.
ఈ మధ్య FaceBook గ్రూప్స్ లో ఫైల్ షేరింగ్ option కూడా ప్రవేశపెట్టారు.... 
Status రాసే దగ్గర ఇలా upload file అనే ఆప్షన్ కన్పిస్తుంది..


దీనిద్వారా 25MB వరకూ ఉన్న ఫైల్స్ group తో పంచుకోవచ్చు...


గ్రూప్ లో ఎవరైన దానిలో మార్పులు కూడా చెయ్యచ్చు....


నేను ఒక సింపులు RAR ఫైల్ upload చేసాను చూడండి..

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు





సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు  
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది  
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి  
కొమ్మ విరగకుండా పూలు కోయండి  
అందులో పూలన్నీ దండ గుచ్చండి  
దండ తీసుకుని వెళ్ళి సీతకియ్యండి  
దాచుకో సీతమ్మ రముడంపేడు  
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు  
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మా  
దాచుకోకుంటేను దోచుకుంటారు.


ఈ మధ్య ఒక   సినిమా పేరు చూడగానే ఎప్పుడో చిన్నప్పటీ ఈ గేయం జ్ఞాపకం వచ్చింది ఇలా పోస్టు చేసాను....



June 6, 2012

Email ID హ్యాక్ అయితే నాకేం అనుకుంటున్నారా?


Email హ్యాక్ అయితే ఏమవుతుందో నాకు అంతగా  తెలీదు.. కానీ తెలిసిన రెండు ముక్కలు రాస్తా...    

నా ఫ్రెండ్స్ కొందర్ని అడినప్పుడు ఇలా అన్నారు.... " నా మెయిల్ లో ఏముంటాయి ? తొక్కలో మెయిల్స్ అంతే కదా  హ్యాక్ చేస్తే వాడికే టైం వేస్టు....  అది పోతే ఇంకోటి ఓపెన్ చేసుకుంటాను... "

వినడానికి బాగానే ఉంది... కానీ అసలు హ్యాక్ చేసినవాడు ఏం చెయ్యచ్చు.....?

మీరు అనుకుంటారు.. పోతే మెయిల్ ఐడీ యే కదా అని.... అదే కాదు మీకు సంబంధించిన అన్నీ అకౌంట్లు మీరు కోల్పోయినట్టే... ఎలా అంటారా ?   పూర్తిగా చదివితే అర్దం అవుతుంది..
 గూగుల్ అకౌంట్ తీసుకుంటే మెయిల్ తో పాటు దానికి సంబంధించిన Youtube, Orkut, Google+ , Blogger, Picasa లో ఉన్న మీ ఫోటోలు.. ఇంకా అన్ని గూగుల్ ప్రోడస్ట్స్ వాడికి ఇచ్చేసినట్టే.....   ఆయా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఏదైనా చెత్త కంటెంట్ పెడితే మీ ఫ్రెండ్స్ మీరు కాదు అలా చేసింది అంటే నమ్ముతారా ?   నమ్మరు.. నానా అవస్ధలు పడాలు ఒప్పించడానికి....  కష్టపడి రాసుకున్న బ్లాగులు పోతాయి.. ఎలా ఉంటుంది అసలు..

మీరు మెయిల్స్ లో చాలా చోట్ల అడ్రస్ ఇచ్చి ఉండచ్చు.. పోన్ నెంబర్లు ఉండచ్చు... వాటి సంగతి ఏంటి ?   
ఆ హ్యాకర్ మీ ఐడీ నుండీ ఏదైనా సంఘవిద్రోహ శక్తులకు మెయిల్స్ చేస్తే  ప్రభుత్వం నుండి ముప్పు వచ్చేది ఎవరికి ? మీకు కాదా ?  నేను ఎక్కడ ఉంటానో ఎలా తెలుస్తుంది అంటారా ?   గూగుల్ password recovery కి మెబైల్ నెంబరు ఇచ్చి ఉంటారు..ఇంకెక్కడైనా ఇచ్చే ఉంటారు.... దాని ద్వారా మిమ్మల్ని పోలీసులు పట్టుకోవచ్చు...  మీరు ఇవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ లిస్టుద్వారా నైనా(వాళ్ళు ఇచ్చుకోని ఉండచ్చు) , logging locations బట్టి  మిమ్మల్ని పట్టుకోవడం పెద్దపనేం కాదు.....  

ఇదంతా వదిలేయండి... మెయిల్ కు సంబంధించినవే కాదు .. మిగతా అన్నీ అకౌంట్లు ఫోయినట్టే... అది ఎలా అంటే......

మీకు చాలా సైట్లలో అకౌంట్లు ఉంటాయి... దానిలోకి వెళ్ళి Forgot password అని నొక్కాడు అనుకోండి... reset link మీ email కు వస్తుంది కదా.. సో.... మెయిలే కాదు ఆ సైట్ కూడా హ్యాక్ చేసినట్టేగా ... FaceBook, Twitter,  రైల్వే అకౌంట్లు, paypal, DropBox , recharge sites,Bank sites  ఒక్కటేంటి ఇంక అన్నీ ఫోయినట్టే..... వాటి ద్వారా ఇంకేమైనా చెయ్యచ్చు..  లేని సైట్లలో రిజిస్టర్ చేసుకొని ఇంకేమైనా చెయ్యచ్చు....

మీరు కాకుండా ఎవరో మీలాగే ప్రవర్తిస్తుంటే ఎలా ఉంటుంది మీకు ?    చెప్పండి..... నిద్ర అయినా పడుతుందా ?

కాబట్టి  బలమైనా passwords వాడండి.ఎక్కువ special characters వాడండి (@ % ^ & * ! ~ ఇలాంటివి)......   వీలైతే తప్పకుండా two step verification వాడండి.. recovery settings లో మెయిల్ ఐడీ, answers కరెక్టుగా ఇవ్వండి... పోన్ నెంబర్లు అస్సలు వాడద్దు password గా..... 
ఇలా చేసుకొని హ్యాపీగా ఉండండి.....   కొల్ఫోయ్యాక బాధపడడం కంటే జాగ్రత్త పడడం మేలు...
ఒక మెయిల్ పోతే ఇంకోటి అనే భ్రమలో ఉంటే వెంటనే మారండి... కాదంటారా ?

June 4, 2012

ఈ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించండి


 గమనిక:  మీ నెట్ కనెక్షన్ స్లో అయితే పూర్తిగా లోడ్ అయ్యేవరకూ కొంచెం ఓపిక పట్టండి..

నా ఆశలకు రూపానివి నువ్వు


 చెలి.......
నా ఊహలకు ఊపిరి నువ్వు
నా ఊసులకు ఉనికివి నువ్వు
నా ఆశలకు రూపానివి నువ్వు
నా కనులకు వెలుగువు నువ్వు
నా కలలకు రంగువు  నువ్వు
నా చిరునవ్వుకు గమ్యం నువ్వు
నా మది పలికే రాగానివి నువ్వు
నా యదలో ఆశలు రేపే చిరుజల్లువు నువ్వు 
నా ఆలోచనలకు భావానివి నువ్వు
నా కడదాకా నడిచే బంధానివి నువ్వు
నిన్ను చూసిన క్షణం నా గుండె కాంతి వేగానికి సమానమైంది
నిన్ను తలచిన మరుక్షణం నా మనసు కేరింతలుకొట్టే పాపాయిలా మారింది
నా కనులు అనుక్షణం నిన్నే చూడాలని తపిస్తున్నాయి....
నే పీల్చే శ్వాస నిరంతరం నిన్నే గుర్తుచేస్తోంది.
ప్రతిక్షణం నా పాదాలు నీతోనే నడవాలనుకుంటున్నాయి
నీపై ఉన్న నా ప్రేమని ప్రకటిద్దామంటే గొంతు మూగబోయింది
ఆ ప్రేమ మదిలోనే ఆవిరిలా ఇంకిపోయింది
నిన్ను చూడనివేళ మనసు ఉప్పొంగిన సముద్రమైంది
నువ్వు దూరమైన వేళ నా హృదయం చలనం లేని రాయిగా మారింది....
నా చెలి నన్ను విడిచి వెళ్ళకు....
చెరగని  చిరునవ్వు గల  నీ పెదాలతో అడిగితే నా ప్రాణమైనా ఇవ్వడానికి నే సిద్దంగా ఉన్నాను....


June 3, 2012

Google Drive లోని పైల్స్ Gmail నుండే వెదకాలంటే....


Google Drive లో మనం Save చేసుకున్న  ఫైల్స్ ను Gmail నుండే వెదకాలంటే ఇలా చెయ్యండి.

MP3 పాటలను Upload చెయ్యకుండానే cut చెయ్యాలంటే....



        ఒక పాటలోని కొంత భాగం మాత్రమే మనకు కావాలి అంటే MP3 cutter అనే software వాడాలి అని అందరికీ తెలుసు... ఆన్ లైన్ లో కట్ చేసుకొనే సదుపాయాలు  చాలా  సైట్లలో ఉంది. కానీ వాటిలోకి పైల్ upload చెయ్యాలి. ఒక్కోసారి ఫైల్ సైజు  పెద్దదిగా ఉన్నప్పుడు టైమ్, బ్యాండ్ విడ్త్ వేస్టు అవుతుంది. 
Related Posts Plugin for WordPress, Blogger...