May 17, 2012

మనిషి ఎప్పుడు మారతాడు ? -- నా పిచ్చి ప్రశ్నలు

నా  పిచ్చి ప్రశ్నలు సమాధానాలు.........


తలకు రంగు ఎప్పుడు వెయ్యలని అనిపిస్తుంది ?

జుట్టు నెరిసిన తరువాత 

వస్తువు విలువ ఎప్పుడు తెలుస్తుంది ?
దాన్ని  పోగొట్టుకున్నాక

ట్రిమ్ గా ఉండాలి అని ఎప్పుడు అనిపిస్తుంది ?
అందమైన అమ్మాయి పరిచయం అయ్యాక

పనిచెయ్యాలని ఎప్పుడు అనిపిస్తుంది ?
ఉద్యోగం వచ్చేదాకా...

నియోజక వర్గం  ఎప్పుడు గుర్తొస్తుంది ?
ఎన్నిక ప్రకటన తరువాత

కోడలుకు స్వేచ్చ ఎప్పుడు వస్తుంది ?
అత్త ఊరు వెళ్ళాక

ప్రేమ విలువ ఎప్పుడు తెలుస్తుంది ?
ప్రేమ దూరం అయ్యాక

ఆదర్శదాంపత్యం అంటే ఏలా ఉంటుంది ?
భార్య స్టవ్ వెలిగిస్తే, భర్త వంట చెయ్యడం
భర్త బట్టలు ఉతికితే, భార్య ఆరేయడం
భర్త ఇల్లు తుడుస్తుంటే, భార్య ఫ్యాన్ స్విచ్ వెయ్యడం..... ఇలా అన్ని పనులు సమానంగా పంచుకోవడం

మనిషి ఎప్పుడు మారతాడు ?
మనిషా.... అది ఎప్పటికీ జరగని పని నాయనా............
(యుగ యుగాలు గడిచినా మనిషి నైజాన్ని మార్చడం ఎవ్వరి వల్లా జరగని పని)

-- గమనిక నేను ఇది తమాషాగా రాసాను....సీరియస్ గా తీసుకోవద్దు..ప్లీజ్....... ఊరకనే నవ్వుకోవడానికి.. సరేనా......

5 comments:

  1. ఆదర్శదాంపత్యం అంటే ఏలా ఉంటుంది ?

    భార్య వంట చేస్తే భర్త భోంచేసి పెట్టాలి...అదీ సమానం గా పని పంచుకోవడమంటే!!!

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు... నాకీ ఐడియా తట్టలేదే..... ధ్యాంక్యూ

      ఇవన్నీ కేవలం హాస్యంగా మాత్రమే పరిగణించగలరు....

      Delete
  2. పిచ్చి ప్రశ్నల్లా ఉన్నా కొన్ని నిజాలే నండీ..!!!
    తమషాగా చాలా బాగున్నాయి.

    ReplyDelete
  3. కమల్ గారు సీత గారు ధ్యాంక్యూ వెరీమచ్.....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...