May 31, 2012

దేవునికి దేవికి తెప్పల కోనెటమ్మ -- అన్నమాచార్య సంకీర్తనలు


Download  (GBK garu)








దేవునికి దేవికి తెప్పల కోనెటమ్మ 
వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా  ||

ధర్మార్థకామ మోక్షతతులు నీ సోపానాలు
ఆర్మిలి నాలుగువేదాలదే నీ దరులు  |
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు 
కూర్మము నీ లోతు వోకోనేరమ్మా  ||

తగిని గంగాది తీర్థమ్ములు నీకడళ్ళు 
జగతి దేవతలు నీజల జంతులు |
గగనపు బుణ్యలోకాలు నీదరిమేడలు 
మొగినీచుట్టు మాకులు మునులోయమ్మా  ||


వైకుంఠ నగరము వాకిలే నీ యాకారము 
చేకొను పుణ్యములే నీ జీవభారము  |
యేకడను శ్రీవేంకటెశుడే నీవునికి 
దీకొని నీ తీర్థమాడితిమి కావమమ్మా ||

1 comment:

  1. నాకు ఈ సంకీర్తన అంటే ఇష్టం... దీనిలో వినిపించే water sound కోసమే ఎప్పుడూ వింటుంటాను...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...