May 19, 2012

ఎంత భాగ్యవంతుడవో ఈకె నీకు దేవులాయ -- అన్నమాచార్య సంకీర్తనలు


Download (G. Balakrishna Prasad )

 
ఎంత భాగ్యవంతుడవో ఈకె నీకు దేవులాయ
వింతలుగా నీకు గానే వెదకి తెచ్చితిని ||

అలివేణి జవరాలు అన్నిటాను చక్కనిది
చిలుక పలుకులదీ చెలియ  |
కలిగె నీకు కన్నుల కలికి ఈకె యొక్కతె 
అలరి ఇట్టె పెండ్లి యాడుదువు రావయ్యా  ||

ఇందుముఖి కంబుకంటి ఇన్నిటా అందమైనది 
చందన గంధి యీ సకియ |
పొందుగా దొరికె నీకు పువ్వు బోణి యొక్కతె
అంది ఈకె నిట్టె పెండ్లియాడుదువు రావయ్యా  ||

జక్కవ చన్నుల లేమ చక్కెర బొమ్మ బిత్తరి
చొక్కపు సింగారాల దీ సుదతి  |
దక్కె శ్రీ వేంకటేశ యీ తరుణి నీకు నొకతె
అక్కరతో ఇట్టే పెండ్లియాడుదువు రావయ్యా ||



4 comments:

  1. మంచి పాట .చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. అవును సీతగారు.. అన్నమాచార్యుల వారి రచనా శైలి అటువంటిది మరి.. ధ్యాంక్యూవెరీమచ్...

      Delete
  2. చెవుల్లో అమృతం కురిపించారు సాయి గారూ!
    1983 నుంచి బాలకృష్ణ ప్రసాద్ గారి అభిమానిని నేను...
    భోపాల్ లో ప్రతి ఏట శ్రీ రామనవమి ఉత్సవాలు జరుపుతాము.
    ఆయన శిష్యుడు మణి గారు మూడు రోజుల పాటు అన్నమయ్య కీర్తనలు గానం చేస్తారు...
    మీ బ్లాగ్ లో అన్నమయ్య కీర్తనలు ఇంతవరకు చూడలేదు...
    మీరు చేసిన ప్రతి పోస్ట్ నుంచి నా దగ్గర లేనివి డౌన్లోడ్ చేసుకుంటాను...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు... నాకూ బాలకృష్ణప్రసాద్ గారి పాటలంటే ప్రాణం... ఇంటర్నెట్ లో నాకు కనపడని సంకీర్తనలను అందించాలన్నదే నా చిన్ని ప్రయత్నం....

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...