February 26, 2012

దేవుడొక్కడే మఱి జీవులు వేరు -- అన్నమాచార్య సంకీర్తనలు

రాగం: బౌళి
కీర్తన: 334 ; రేకు : 59 
Volume: 15 (ఆధ్యాత్మ సంకీర్తనలు)
Page no: 225
 
దేవుడొక్కడే  మఱి జీవులు వేరు
వావాత తెలిసేది వారి వారి భాగ్యము  ||

పొడమినవారికి పోయినవారికి 
గడియలొక్కటే వారిగతులు వేరు |
బడి పుణ్యములు సేయ పాపములు సేయగ
కడగి కాల మెక్కటే కర్మములేవేరు ||


కాకములు సంచరించె కలహంసలు తిరిగె
ఆకాశమెక్కటే విహారాలు వేరు |
మేకొని యెండలు  కాయ మించి చీకటులు రాయ
లోకపు బయలొక్కటే జోకలే వేరు ||

అట్టే ఏలే రాజులకు నడిగేటి దీనులకు 
పట్టి భూమి ఒక్కటే బాగులు వేరు  |
గుట్టున శ్రీ వేంకటేశు గొలువగ దలచగ
నెట్టిన దేహమెక్కటే నేరుపులే వేరు  ||


గమనిక:  నాకు Internet లో లిరిక్స్,ఆడియో కనపడని అన్నమయ్య  సంకీర్తనలను అందించాలని చిన్ని ప్రయత్నం... వీటిని నేనే టైప్ చేసాను కనుక అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...



1 comment:

  1. మంచి ఆలొచన సాయి గారు....
    ఇలానె మంచివి అందించండి...
    ఈ పాట చాల బగుంది..

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...