February 19, 2012

శివరాత్రికి ఈ కోతిపిల్లలా మీరు ఉపవాసం చెయ్యగలరా ?



ముందుగా బ్లాగర్లు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.....  శివరాత్రికి చాలా మంది ఉపవాసం, జాగారం చేస్తుంటారు...
ఉపవాసం అంటే అర్దం తెలుసా? 
ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించడం.... సో... దేవునికి దగ్గరగా నివసించడం అన్నమాట.. మనం కడుపునిండుగా తింటే ఇక దేవునిపై మనసు లగ్నం కాదు కదా అందుకని ఇలా ఉపవాసాలు ప్రవేశపెట్టారు... ఉపవాసంలో  ఆహారం స్వల్పంగా తీసుకోవచ్చు(పాలు, పండ్లు లాంటివి) .....అంతేకానీ మరీ కటిక ఉపవాసాలు చేసినా  మనసు ఆయనపై లగ్నం కాకపోతే మాత్రం  అది బూడిదలో పోసిన పన్నీరే....
శివరాత్రి రోజు ఆ మహాశివుడు మనకు వరాలివ్వడానికి భూమి మీదకు వస్తాడు అని అంటారు.. కాబట్టి ఆయన రాకకోసం మనం వేచి ఉన్నాం అని తెలియజేయడానికి జాగరణ చేస్తాం....
అయ్యో అసలు చెప్పాలనుకుంది ఇది కాదే...........
ఆ.........ఉపవాసం గురించి వెదుకుతుంటే ఈ కధ దొరికింది........ ఈ కధలో కోతిపిల్ల శివరాత్రికి  భలే ఉపవాసం చేసింది లేండి.. తనతో పాటు తన పక్కనున్న అందరి ఉపవాసాన్ని ఎలా భగ్నం చేసిందో తెలుసా ? 
అబ్బా చదువుతుంటే నవ్వుఆగలేదు...  మీరూ ఇక్కడ చదువుకోండి


3 comments:

  1. హహా అవును భలే నవ్వొస్తొంది..కథ కుడా సూపర్...:)
    ఇలా కాకుండా మమూలుగా చెస్తే మంచిదేమొ కదా....

    ReplyDelete
  2. ఇంచుమించు ఇలాంటిదే....క్రిందటేడు శివరాత్రి సందర్భంగా సాహిత్యాభిమానిలో పడిన వ్యాసం చదివాను...విన్నాను. ఆ అడియోను నా యూట్యూబులో పెట్టాను విని ఆనందించండి. అందులో పూజల పేరిట మనం చేసే తంతుగురించి శివా గారు బాగా చెప్పారు. లింకు:
    http://www.youtube.com/watch?v=Ntg3vkN2uxk&feature=plcp&context=C3659b49UDOEgsToPDskL5E3LoIzp9DD5-gH0pVJg3

    ReplyDelete
  3. ఇంచుమించు ఇలాంటిదే....క్రిందటేడు[2010] శివరాత్రి సందర్భంగా సాహిత్యాభిమానిలో పడిన వ్యాసం చదివాను...విన్నాను. ఆ అడియోను నా యూట్యూబులో పెట్టాను విని ఆనందించండి. అందులో పూజల పేరిట మనం చేసే తంతుగురించి శివా గారు బాగా చెప్పారు. లింకు:
    http://www.youtube.com/watch?v=Ntg3vkN2uxk&feature=plcp&context=C3659b49UDOEgsToPDskL5E3LoIzp9DD5-gH0pVJg3

    http://saahitya-abhimaani.blogspot.in/2010/02/blog-post_360.html

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...