January 23, 2012

ఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణుమయమే -- అన్నమాచార్య సంకీర్తనలుఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణుమయమే
వదలక హరి దాస వర్గమైన వారికి || ముంచిన నారాయణ మూర్తులీ జెగమెల్ల 
అంచిత నామములే ఈ అక్షరాలెల్ల
పంచుకొన్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్ల
తెంచివేసిమేలు తా తెలిసేటివారికి ||చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే
భారపు ఈ భూమీ తన పాద రేణువే
సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే
ధీరులై వివేకించి తెలిసేటి వారికి ||చిత్తములో భావమెల్ల శ్రీవేంకటేశుడే

హద్దిన న ప్రకృతియెల్ల ఆతని మాయే
మట్టిలి ఈతని కంటే మరిలేవు ఇతరములు
తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి ||By: G.BalaKrishna Prasad Garu..

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...