January 18, 2012

మానరె మాయలు మగువలు -- అన్నమాచార్య సంకీర్తన




మానరె మాయలు మగువలు నే
కాను కాననుచు కనలీ శిశువు  ||

పాలట దొంగిలె బాలుడు గో-
పాలుల  కూడుక పలుమరును |
పోలవీమాటలు(మాయలు) బొంకులు
యేలె యేలె మీ రెలజవ్వనులు  ||

సారెకు వెన్నలు చవులట యీ-
దూరులు మీకిక దొసగులును |
చేరువ గరిమలు చెల్లవు మీరు
పోరె పోరె వొరపుల నెర సతులు  ||  



కింకలు మీకివి గెలుపులు నెల-
వంకలు మీకివి వన్నెలునూ |
వేంకటపతి మీ విభుడట మీరు
బొంకక బొంకక పొలతురు మనరే  ||




సంకీర్తన వినడానికి మీ స్పీకర్లను ఆన్ చేసుకోండి



1 comment:

  1. డౌన్లోడ్ లింకుపై రైట్ క్లిక్ చేసి save link as అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా సేవ్ చేసుకోవచ్చు...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...