July 3, 2011

విండోస్-7 లో explorer బార్ లోని సెర్చ్ బాక్సుని వాడడం



     విండోస్-7 ఆపరేటింగ్ సిస్టంలో explorer బార్ లో ఉన్న సెర్చ్ బాక్సు ద్వారా మనకు  కావలిసిన ఫైల్స్ ను సులభంగా  వెదకవచ్చు.


ఫైల్ extension వెదకడానికి: మనకు ఒక ఫైల్ టైప్ కు సంబందించిన ఫైల్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు  ‘* ’ ను వైల్డ్ కార్డ్ లా వాడవచ్చు.
ఉదా:  మనకు .doc అనే extension కు సంబందించిన వర్డ్ ఫైల్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు *.doc  అని టైప్ చేయాలి.

సైజ్ వెదకడం: మన దగ్గర ఉన్న ఫైల్స్ లో 128 మెంబీల లోపల ఉన్న ఫైల్స్ మాత్రమే కావాలి అంటే ఇలా size అని టైప్ చేసి ఎంచుకోవడమే.  ఉదా: size:huge

కావలిసిన టైప్ ను వెదకడానికి: మనకు ఉన్న ఫైల్స్ లోనుండీ ఇమేజ్ లు మాత్రమే కావాలి అంటే type: అని image అని సెర్చ్ చెయ్యాలి
ఉదా: type:image   ;  type:video  ;   type:doc

కైండ్ ద్వారా వెదకడం: kind అనే కమాండ్ ద్వారా మనం వెదుకుతున్నది ఫోల్డరా లేక క్యాలండరా అని కూడా ఎంచుకోవచ్చు.




1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...