May 20, 2011

చదువు చదివితే వస్తుందా లేక చదివిస్తే వసుందా ?


          
           మొన్న ఈ మధ్యన మా స్నేహితుని ఇంటికి వెళ్ళాను...వాళ్ళ ఇంటి ఓనర్ కు ఒక అబ్బాయి ఒక అమ్మాయి..అయితే ఆ పాపకు ఏడవ తరగతి పరీక్షలు అనుకుంటాను, వాళ్ళ అమ్మ చదివిస్తుంది...ఆమెకు ఏదో ఇంట్లో పని ఉండి లోపలికి వెళ్తూ ఎక్కడ చదవడం అపేస్తుందో అని తమ్మున్ని కాపలా పెట్టింది. ఈ పాపకు చదవాలని లేదు..
కాసేపు చదవడం, కాసేపు ఎటో అలోచించడం..ఇక వెంటనే ఆ తమ్ముడు ఊరుకుంటాడా “అమ్మా అక్క చదవడం లేదే” అని ఒక కేక వేశాడు..వెంటనే దొడ్లో నుంచి నాలుగు బూతులు పది శాపనార్దాలు వినిపించాయి..అవి విన్న ఈ పాప ఊహలోనుంచి తేరుకోని చదువుతున్నాను అమ్మా అంటూ మరలా చదవడం ప్రారంభించింది. మరలా కొంత సేపటికి ఇదే తంతు....

       అసలు చదువు అనేది చదివితే వస్తుందా...చదివిస్తే వస్తుందా?....ఆసక్తి లేని సమయంలో ఎన్నిసార్లు చదివినా ఎంత చదివినా గానీ బుర్రకు ఎక్కదు.....మీరు ఎదురుగా ఉండి పది గంటలు చదివించినా గానీ..ఏకాగ్రత లేన్నప్పుడు అది ఎంత వరకూ ఎక్కుతుంది మీరే చెప్పండి..

         నేడు ఇలా నేను చెప్పిన విషయం ఒక్క ఈ ఇంట్లోనే కాదు మెత్తం అన్ని చోట్ల ఇదే పరిస్దితి ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలో చదివే వారికీ మరీ తిప్పలు.. అసలు ఎనిమిదో తరగతి నుంచే ఐఐటి కోచింగులు ఇవన్నీ అవసర మంటారా?

         బాల్యం అనేది జీవితంలో మరపురాని ఘట్టం అలాంటి బాల్యాన్ని మీరు అడుగంటేలా చేస్తున్నారేమో అక్కసారి అలోచించండి.. ఉదయం నిద్రలేచి లేవక ముందే వ్యాను వస్తుందంటూ తయారు చేసేస్తాం....8 గంటలకల్లా వెళ్ళిన పిల్లలు సాయంత్రం ఎనిమిదికి తిరిగి వచ్చే స్కూల్లు ఉన్నాయి..అంటే ఒక రోజులో సగం దీనికే సరిపోతుంది...ఇంటికి వచ్చిన పిల్లలును మరలా ట్యూషన్లు అంటూ తిప్పుతున్నాం....
ఇక వాళ్ళు తోటి పిల్లలతో కలిసి అనందంగా ఆటలాడు  కోవడానికైనా సమయం ఇస్తున్నామా? బంధువులతో ఎలా మెలగాలి అని తెలుసుకోవడానికి, అనుబంధాలు, ఆప్యాయతలు తెలుసుకోడానికి తగినంత సమయాన్ని ఇస్తున్నామా? అసలు బంధువులపై ఆప్యాయత మనకుందా? ఎవరైనా మా ఇంట్లో పలానా శుభకార్యం రాండి అని పిలిస్తే “లేదండీ మా పిల్లలకు పరీక్షల్లు ఉన్నాయి చదివించాలి” అని మనకు వెళ్లడం ఇష్టం లేదన్న విషయాన్ని ఏమీ తెలియని అమాయకపు పిల్లలమీద నెట్టేసి తప్పుకుంటున్నాం...ఇది నిజం కాదంటారా? మీరు ఈ రోజు పిల్లలపై చూపించిన ప్రేమే రేపు వాళ్ళు మీ పైన చూపిస్తారు.....మీరు ఈ రోజు మీ బందువులను ఎలా దూరంగా ఉంచుతున్నారో చూసిన మీ పిల్లలు రేపు మీ మీద కూడా అదే అస్త్రం వాడితే ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి?........


1 comment:

  1. అవును కరెక్ట్ గా చెప్పారు ...అందుకే ఇప్పటి పిల్లలకి కనీసం బంధువుల పేర్లు కుడా తెలేయడం లేదు ....
    బాల్యం అనేది తిరిగి రాదనీ వీళ్ళకి ఎలా తెలిసేలా చేయాలో అర్ధం కావడం లేదు ...ప్రస్తుతానికి ఎం చేయలేం ఇలా పోస్ట్ లు రాసుకోవడం తప్ప......

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...