May 20, 2011

అసలు ఎందుకీ బ్లాగ్ ?



          మీకో విషయం చెపాలండోయ్....నేను ఈ కంప్యూటర్ గురించి నేర్చుకోని....ఎక్కువ కాలం కాలేదు. కానీ కొన్ని రోజుల్లోనే చాలా పుస్తకాలు, మ్యాగ్ జైన్లు చదివి....కొంచెం విజ్ఞానం సంపదించగానే ఇక ప్రపంచాన్నే ఉర్దరించేద్దాం మని ఒక టెక్నికల్ బ్లాగ్ ను ప్రారంభించేశాను...
కొంచెం తెలుగు...కొంచెం తెగులు కలగలిపి రాసేవాడిని. కొన్నాళ్ళకు నాకు అర్దం అయ్యింది.. అసలు నేను తెలుసుకున్నది సముద్రంలో చిన్న నీటి బిందువనీ తెలుసుకోవసింది..ఎంతో ఉందని..

             అంతేకాదు కంప్యూటర్ ఎరాను నడిపుతున్ననల్లమోతు శ్రీధర్ గారి ముందు నేను ఎంత అని అర్దం అయ్యింది (హనుమంతుని ముందు కుప్పిగంతులా అన్న సామెతకు అర్దం తెలుసొచ్చింది)...ఆయన బ్లాగ్ లో రాసే విషయాలు + ఆయన బ్లాగ్ ను పొల్లు పోకుండా కాపీ కొట్టే కొన్ని బ్లాగులను అన్నీ చదివాక ఒక్క విషయం మాత్రం తెలిసింది. ఎందరో వ్యక్తులు కంప్యూటర్ రంగంలో వారి వారి కృషిని అందిస్తున్నారు. ఇక నేను చెయ్యవసిందల్లా వారి సైట్లని చదివితే చాలు అని. ఇక వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా బ్లాగ్ ను డిలీట్ చేసేశాను...(ఇదేదో శ్రీధర్ గారిని పొగడడానికి రాసింది కాదు ఆయనపై నాకున్న అభిమానం అలాంటిది మరి)

      చిన్నప్పటి నుండి నాచుట్టూ రకరకాల విషయాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని గురించి నాలో నేనే సంఘర్షణ పడడం కన్నా పది మందిని అడగడం మేలు అనిపించింది..అందుకే ఇలా ఒక బ్లాగ్ ను ప్రారంభించుకున్నాను...

3 comments:

  1. సాయి గారూ!మీ ఉద్దేశ్యం మంచిదే .. ఎందుకు బ్లాగింగు ఆపడం?నల్లమోతు శ్రీధర్ గారు ఎప్పుడూ నాలెడ్జ్ ని పంచితే పెరుగుతుందని చెప్తుంటారు. ప్రతి చిన్న సందేహానికి శ్రీధర్ గారిని అడగలేము.ఆయన కొన్ని వేలమందికి సమాధానాలు చెప్పాలి.ఆయన అభిమానులు గా మీలాంటి వాళ్ళు పని చేయవచ్చుకదా?

    ReplyDelete
  2. శివ ఘనపాఠి గారు...ప్రస్తుతానికి నేను కొన్ని బాధల్లో ఉన్నాను... మీరు చెప్పింది బాగుంది... కొన్నాళ్ళ తరువాత ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు........

    ReplyDelete
  3. sai sir dont stop the blog please continue the blog .............. i request

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...